US Lauds S. Africa For Swiftly Sharing Information On Omicron | దక్షిణాఫ్రికాపై అమెరికా ప్రశంసలు

US Lauds S. Africa For Swiftly Sharing Information On Omicron | దక్షిణాఫ్రికాపై అమెరికా ప్రశంసలు

కరోనా వైరస్ నూతన వేరియంట్ ఒమిక్రాన్ ను..గుర్తించిన వెంటనే ప్రపంచానికి చెప్పిన దక్షిణాఫ్రికాపై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసలు కురిపించింది. కొత్త వేరియంట్ ను గుర్తించి, వెంటనే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం గొప్ప విషయమని... అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.బ్లింకెన్ దక్షిణాఫ్రికా విదేశాంగమంత్రి నలెడి పాండొర్ తో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికాలో వ్యాక్సికేషన్ ప్రక్రియపై చర్చించారు. సమాచారాన్ని పంచుకోవడంలో పారదర్శకత ప్రదర్శించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం............ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని...... బ్లింకెన్ కొనియాడారు. అయితే కొత్త వేరియంట్ ను గుర్తించిన తర్వాత ప్రపంచదేశాలు ప్రయాణ ఆంక్షలను విధించడంపై...... దక్షిణాఫ్రికా ఆవేదన వ్యక్తం చేసింది. వైరస్ ను త్వరగా గుర్తించినందుకు శిక్ష అనుభవిస్తున్నామని పేర్కొంది. కరోనా వైరస్ మొదట చైనాలో 2019 డిసెంబర్ లో బయటపడింది. అయితే.. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం ఆలస్యంగా ప్రపంచానికి వెల్లడించింది. ఫలితంగా ప్రపంచదేశాలు ఇప్పటికీ ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. కరోనా మూలాలు ఆన్వేషించేందుకు అమెరికా ప్రయత్నించగా.. చైనా సహకరించలేదు. దక్షిణాఫ్రికా మాత్రం చాలా వేగంగా ఒమిక్రాన్ విషయం వెల్లడించడంతో ఆ దేశాన్ని అగ్రరాజ్యం మెచ్చుకుంది.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments